కొడంగల్: స్పీకర్ ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును అరెస్టు చేయాలని యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణంరాజు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరి కాదన్నారు. ప్రజా ప్రతినిధిగా సభా మర్యాదలు కాపాడాల్సిన బాధ్యతను ఎమ్మెల్సీ విస్మరించారని విమర్శించారు. మధుపై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే అరెస్టు చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, కోస్గి మున్సిపల్ చైర్మన్ నరేందర్, పార్టీ జిల్లా కార్యదర్శి బాల్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, టౌన్ ప్రెసిడెంట్ నయీమ్, ఏఎంసీ డైరెక్టర్ ఆసిఫ్‌ఖాన్, కౌన్సిలర్ హమీద్, అశ్వాక్, రాము, బత్తుల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
తాతా మధును సస్పెండ్ చేయాలి
దౌల్తాబాద్: స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతామధు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ సందర్బంగా కాంగ్రెస్ మండల నాయకులు మాట్లాడుతూ శాసనసభ స్పీకర్‌ను అవమానించిన తాతామధును బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ దళితుడు కావడం వల్లే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, రెడ్యానాయక్. నర్సింలు, మధుసూధన్, భీంరెడ్డి, అంబయ్య, రవినాయక్, నరేందర్, అమర్‌నాథ్, రాములుగౌడ్, షఫీ, తదితరులున్నారు.
యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణంరాజు


