మహిళలు ఐక్యంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు ఐక్యంగా ఉండాలి

Sep 9 2026 11:57 AM | Updated on Sep 9 2026 11:57 AM

కొడంగల్‌ రూరల్‌: మహిళల భధ్రతకు మహిళలే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ ఐఏఎస్‌ సూచించారు. మంగళవారం పట్టణంలోని ఐకేపీ కార్యాలయంలో జెండర్‌ రీసోర్స్‌ సెంటర్‌ విజిట్‌లో భాగంగా సెర్ఫ్‌ జెండర్‌ డైరెక్టర్‌ జమున ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనితా రామచంద్రన్‌ మాట్లాడుతూ.. మహిళల్లో జెండర్‌ సమస్యలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగకుండా, మహిళలకు అన్యాయం జరుగకుండా మహిళలంతా ఐక్యంగా ఉండాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రతీ నెల సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే సమీపంలోని మహిళా కమిటీలు స్పందిస్తూ మండల రీసోర్స్‌ సెంటర్‌కు వివరాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్‌ ఎస్‌సీఎంయూ లింగమయ్యగౌడ్‌, డీఆర్‌డీఏ ఏపీడీ నర్సింలు, డీపీఎం ఐబీ నర్సింలు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జానకి, కార్యదర్శి శ్వేత, మండల సమాఖ్య అధ్యక్షురాలు అంజమ్మ, కార్యదర్శి మాసనమ్మ, కోశాధికారి సత్యమ్మ, ఏపీఎం పి.గోపాల్‌, సీసీలు రాములు, అరవింద్‌కుమార్‌, బసంత్‌కుమార్‌, వాణిశ్రీ, జి.రాములు, అకౌంటెంట్‌ పుష్పలత, వివిధ గ్రామాల జెండర్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

రాష్ట్ర మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రామచంద్రన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement