నేటి నుంచి ఎస్‌జీఎఫ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎస్‌జీఎఫ్‌ పోటీలు

Sep 9 2026 11:57 AM | Updated on Sep 9 2026 11:57 AM

నేటి నుంచి ఎస్‌జీఎఫ్‌ పోటీలు ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌గా గణేశ్‌ నాయక్‌ లీగల్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా సచిన్‌ ‘లిఫ్ట్‌ ఇరిగేషన్‌’కు భూములిచ్చేందుకు అంగీకారం 11, 12 తేదీల్లో కబడ్డీ ఎంపిక పోటీలు హుడాకాంప్లెక్స్‌: జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్వంలో జూనియర్‌ బాలురు, సబ్‌ జూనియర్‌ బాలికల జిల్లా జట్ల ఎంపిక నిర్వహించ నున్నట్టు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌, ప్రధానకార్యదర్శి పి.సుధాకర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 11, 12 తేదీల్లో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించే అంతర్‌జిల్లా కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటా రని చెప్పారు. బాలురు 75 కిలోల లోపు 05–11–2006 తరువాత పుట్టినవారు అయి ఉండాలని, బాలికలు 55 కిలోల లోపు 13–12–2010 తర్వాత పుట్టినవారు అయి ఉండాలని తెలిపారు. ఆధార్‌కార్డు, పదో తరగతి మెమోతో హాజరుకావాలన్నారు.

కొడంగల్‌ రూరల్‌: 70వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) క్రీడా పోటీలు బుధవారం నుంచి నిర్వహించనున్నట్లు కొడంగల్‌ ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి పి.అజీజ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొడంగల్‌ జోన్‌ పరిధిలోని కొడంగల్‌, దౌల్తాబాద్‌, దుద్యాల, బొంరాస్‌పేట మండలాల్లోని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలు ఉంటాయన్నారు. 9న పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ (బాలుర) పాఠశాలలో వాలీబాల్‌ పోటీలు, 11న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఖో ఖో పోటీలు, హస్నాబాద్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో కబడ్డీ, 19న కొడంగల్‌ ప్రభుత్వ జూనియర్‌కళాశాలలో అథ్లెటిక్స్‌ పోటీలు ఉంటాయన్నారు. అండర్‌–14, అండర్‌–17 బాల, బాలికల విభాగంలో పాల్గొనే క్రీడాకారులు అర్హత ఫామ్‌, బోనోఫైడ్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌కార్డుతో ఉదయం 9గంటలకు హాజరుకావాలని తెలిపారు.

కుల్కచర్ల: మండల పరిధిలోని అల్లాపూర్‌కు చెందిన గణేశ్‌ నాయక్‌ ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఖమ్మం జిల్లాలో మూడురోజులుగా కొనసాగుతున్న రాష్ట్ర కార్యవర్గసమావేశాల్లో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. మంగళవారం గణేశ్‌ నాయక్‌ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర నాయకత్వం తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, విద్యావ్యవస్థ ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం పోరాడుతామన్నారు.

తాండూరు టౌన్‌: తెలంగాణ లీగల్‌ స్టూడెంట్‌ అ సోసియేషన్‌ జిల్లా అధ్య క్షుడిగా ఎ.సచిన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం అసోసియేషన్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కె.బాలునాయక్‌ ఆయనకు నియామకప త్రం అందజేశారు. తాండూరు పట్టణానికి చెందిన సచిన్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ తృతీయ సంవత్సరం చదువుతుత్నాడు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లా విద్యార్థుల సమస్యల పరిష్కారం, సంస్థ లక్ష్యాల సాధనకు కృషి చేస్తానన్నారు.

కొడంగల్‌ రూరల్‌: కొడంగల్‌–నారాయణపేట–మఖ్తల్‌ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అధికారులు సర్వే చేసిన భూమిని ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు. ఈ మేరకు మంగళవారం పర్సాపూర్‌ రైతువేదికలో సర్పంచ్‌ కన్నం రాధాశ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ రాంబాబు, డిప్యూటీ తహసీల్దార్‌ అనిత, జీపీఓ వెంకటేశ్‌, సర్వేయర్‌ మహేష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులు తమ భూమిని ఇచ్చేందుకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సర్వే నిర్వహించిన భూమికి సంబంధించి 87 మంది రైతులు 12.29 ఎకరాలు ఇచ్చేందుకు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారని సర్పంచ్‌ రాధారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాములు, శ్రీశైలం, మల్లేశం, రాములు, వెంకటేశం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement