అనంతగిరి: సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ విచారణ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆలంపల్లి జెడ్పీహెచ్‌ఎస్ పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విచారణకు వచ్చిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలని సూచించారు. అనామలీస్, మ్యాపింగ్ కానీ, ఓటర్ జాబితాలో పుట్టిన తేదీల మార్పుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు నోటీసులు జారీ చేయని వారిని గుర్తించి విచారణకు హాజరు అయ్యేలా బీఎల్‌ఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్ వెంట ట్రెయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, వీఆర్‌ఓ స్వర్ణలత, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తదితరులు ఉన్నారు.
బాలికలగురుకుల పాఠశాల, పీహెచ్‌సీ తనిఖీ
ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి విద్యార్థులు సూచించారు. మంగళవారం ఆయన వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేట మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, రామయ్యగూడ పీహెచ్‌సీలకు ఆకస్మికంగా సందర్శించారు. ప్రాథమిక హక్కులు, విధులపై పదోతరగతి విద్యార్థులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని భోజనశాల, స్టోర్, కిచన్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం రామయ్యగూడ పీహెచ్‌సీ సందర్శించి ప్రజలకు నాణ్యమైన వైద్యంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. ఆస్పత్రి మరమ్మతు పనులకు అవసమరైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌ఓ ప్లాంట్, ఆస్పత్రి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ట్రెయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఎంహెచ్‌ఓ సుధాకర్ లాల్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డాక్టర్ సౌమ్య తదితరులు ఉన్నారు.
రైతులకు అవగాహన కల్పించండి
సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన వికారాబాద్ మండలం నారాయణపూర్‌లో మొక్క జొన్న, కంది పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు పంటల సాగుపై నూతన సాంకేతికతపై అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట డీఏఓ బి.కవిత, మండల వ్యవసాయ అధికారి ప్రసన్న లక్ష్మి తదితరులు ఉన్నారు.
‘టాస్’ ప్రవేశాల లక్ష్యాన్ని అధిగమించాలి
టాస్ అడ్మిషన్‌లకై తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర సమన్వయకర్త ఏనుగు క్రాంతిరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ దీపక్‌తివారి ఇతర ముఖ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్‌ను కలిసి అడ్మిషన్‌ల పక్రియపై చర్చించారు. టాస్ అడ్మిషన్లు పెరిగేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీపీఓ జయసుధ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దీపక్ తివారి


