అనంతగిరి: గణేశ్ ఉత్సవాల సందర్భంగా భద్రతా, బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ స్నేహ మెహ్ర మంగళవారం జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రతా చర్యలను తప్పకుండా పాటించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిమజ్జన కార్యక్రమాలకు మందస్తు ప్రణాళిలు చేపట్టాలన్నారు. ప్రతీ పీఎస్ పరిధిలోని మండపాలు, నిమజ్జన మార్గాలను, ప్రదేశాలు, ముందుగానే గుర్తించి పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, పార్కింగ్, లైటింగ్ తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖల సమన్వయంతో చేట్టాలని ఆదేశించారు. మండపాల పూర్తి వివరాలను సేకరించి నిర్వాహకులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ కేసులను పరిష్కరించండి
దోమ: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె దోమ ఠాణాను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, కేసుల దర్యాప్తు తీరును పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీఎస్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. పెట్రోలింగ్ ముమ్మరం చేయలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కొండల్‌రెడ్డి, ఎస్‌ఐ వసంత్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్స్ భీంరెడ్డి, నర్సింలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
క్రీడల్లోనూ రాణించాలి
కుల్కచర్ల: విద్యార్థులు దృఢమైన సంకల్పంతో ముందుకు సాగితే అనుకున్న విజయాలను సాధించవచ్చునని ఎస్పీ స్నేహమెహ్ర అన్నారు. మంగళవారం సాల్వీడు గ్రామంలో ఎస్‌జీఎఫ్ వాలీబాల్ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కొండల్ రెడ్డి, ఎస్‌ఐ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, పీడీ ఖాజ, పీఈటీలు ప్రవీణ్‌కుమార్, కేశవులు, కృష్ణారెడ్డి, ఇన్‌చార్జి హెచ్‌ఎం స్వయంప్రకాష్, స్థానిక సర్పంచ్ లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ సంధ్యారాణి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంతోష, నాయకులు కొండయ్య, బాలయ్య, నర్సింలు, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్


