పరిగి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ వద్ద చోటు చేసుకున్న ఘటనలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయడం సరికాదన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించడం హేయనీయమన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆంజనేయులు, ప్రవీణ్‌రెడ్డి, శ్రీవణ్‌రెడ్డి, శషాంక్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి


