కొడంగల్: పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో రూ.27 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ నూతన భవనంలో సోమవారం నుంచి అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలు ప్రారంభమైనట్లు ఆర్‌ఎంఓ డాక్టర్ రవీంద్ర యాదవ్ తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అన్ని విభాగాల్లో సేవలు అందిస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చే బాధితులకు అత్యవసర సేవలు అందించడానికి అత్యవసర సేవలు అండుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలో రూ.5 భోజనాన్ని (ఇందిరమ్మ క్యాంటిన్) ప్రారంభించారు. రోగులకు ఉదయం పూట రూ.5కే టిఫిన్, మధ్యాహ్నం రూ.5కే భోజనం వడ్డించారు. రోగుల వెంట వచ్చే వారికి భోజనం అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ సాకేత్, జూనియర్ అసిస్టెంట్ మోహన్ పాల్గొన్నారు.
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ఆర్‌ఎంఓ డాక్టర్ రవీంద్రయాదవ్


