మోమిన్‌పేట: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయో చెప్పాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను వ్యతిరేకిస్తూ సోమవారం మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ మీదుగా వెళ్లి తహసీల్దార్ మునిరొద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి 420 హామీలు, ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్‌కు పంగనామం పెట్టారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ గట్టు రాంచందర్‌రావు, జెడ్పీ వైస్ చైర్మన్ బీ విజయ్‌కుమార్, పార్టీ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు వెంకట్, సర్పంచులు విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, నాయకులు తిరుపతిరెడ్డి, అనూప్‌రెడ్డి, మశ్చేందర్‌రెడ్డి, మైబల్లి, కలేద్ తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్


