నవాబుపేట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కించపర్చేలా ‘అంబేడ్కర్ కల్పిత నాయకుడు’ పేరుతో పుస్తకం రాసి, సోషల్ మీడియా వేదికలపై అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యవహరిస్తున్న హమారా ప్రసాద్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్ డీఎస్పీ అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం మండల అధ్యక్షుడు ఆనందం, దళితరత్న అవార్డు గ్రహీత శివరాజ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ వెంకటరెడ్డి, నాయకులు వెంకటయ్య, ప్రభాకర్‌రెడ్డి, ప్రసాద్, దళిత సంఘాల నాయకులు చంద్రశేఖర్, శామయ్య, చంద్రం తదితరులు పాల్గొన్నారు.
దేశద్రోహం కేసు నమోదు చేయాలని వినతి


