మొయినాబాద్ రూరల్: పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన అసెంబ్లీ ముట్టడిలో బీజేవైఎం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డిపల్లి శ్రీకాంత్ గాయపడ్డారు. సోమవారం అసెంబ్లీ వద్దకు చేరుకున్న పలువురు కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో జరిగిన శ్రీకాంత్ చేతికి బలమైన గాయమైంది. ఈ స్పందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. నగరానికి తరలివెళ్లిన వారిలో యువజన, విద్యార్థి విభాగాల నేతలు మహేష్, ఎల్లేష్‌గౌడ్, రామకృష్ణ, జగన్‌మోహన్, సురేందర్‌రెడ్డి, సాయి, వికాస్, చరణ్‌గౌడ్, ఓంప్రకాష్, వంశీ తదితరులు ఉన్నారు.


