● బీఆర్‌ఎస్ నేతలది మేకపోతు గాంభీర్యం
● కాంగ్రెస్ నేతలు రాజేశ్‌రెడ్డి, నర్సింలుగౌడ్
బొంరాస్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న రెండేళ్ల ప్రజాపాలనను, ప్రజాదరణను ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు చేసిన విమర్శలను ఖండించారు. పదేళ్ల నిరంకుశ పాలనపై తిరగబడ్డ ప్రజలు కాంగ్రెస్ పాలనను తెచ్చుకున్నారని తెలిపారు. కొడంగల్‌ను దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిపై ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తిప్పికొడుతారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్, గోవర్ధన్‌రెడ్డి, జయకృష్ణ, సర్పంచు వీరేశలింగం, సంగాయిపల్లి నర్సింలు, సూర్యప్రకాశ్‌గౌడ్, బ్యాగరి రాములు, పుట్టి నర్సింలు తదితరులున్నారు.


