పూడూరు: శ్రావణమాసం చివరి సోమవారం సందర్బంగా మండల పరిధిలోని దామగుండ రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మండల పరిధిలోని భక్తులేకాకుండా ఇతర ప్రాంతాల భక్తులు వచ్చి పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేష్‌రెడ్డిలు స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లేశం, సొసైటీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు రహీస్‌ఖాన్, నాయకులు రాజేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మైపాల్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


