● స్పీకర్‌పై ఆయన చేసిన
వ్యాఖ్యలు దారుణం
● కాంగ్రెస్ నేతల ఆందోళన
ధారూరు: శాసనసభ స్పీకర్, దళిత ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌పై సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ధారూరులో ధర్నా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శి బాబాఖాన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాములు అధ్వర్యంలో తాండూరు– హైదరాబాద్ ప్రధాన రోడ్డుపై నిరసన వ్యక్తంచేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ రఘరామ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ధారూరు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతిగారి మలేశం, నాయకులు కల్వ కిరణ్‌కుమార్, బుజ్జయ్యగౌడ్, అమరేశ్వర్‌రావు, లింగనపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కేరెళ్లిలో మధుసూదన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు చెన్నారెడ్డి, దయాకర్‌రెడ్డి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
అనర్హుడిగా ప్రకటించాలి
ధారూరు: దళిత నేత, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వాక్యలు చేసిన ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌పై కేసు నమోదు చేసి, ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని ధారూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాన్‌సింగ్ డిమాండ్ చేశారు. ఆయనను పదవి నుంచి శాశ్వతంగా తొలగిస్తేనే ఇతర ప్రజా ప్రతినిధులను కనువిప్పు కలుగుతుందన్నారు.
దిష్టిబొమ్మ దహనం
మోమిన్‌పేట: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై తాత మధు చేసిన వ్యాఖ్యలను దారుణమని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు మోమిన్‌పేటలో మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు సిరాజొద్దీన్, మహంత్‌స్వామి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
వికారాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు
అనంతగిరి: స్పీకర్ ప్రసాద్‌కుమార్ పట్ల అనుచిత వ్యాఖ్యలు తాతా మధు సభ్యత్వాన్ని వెంటనే తొలగించాలని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్‌లోని ఎన్‌టీఆర్ చౌరాస్తాలో తాతా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మల్లేశం పెండ్యాల అనంతయ్య, మధుకర్, మల్లికార్జున్‌గౌడ్, పరుశరాం, సతీష్‌రెడ్డి, నిఖిల్‌రెడ్డి, శివయ్య, శ్రీనివాస్, బాదం అశోక్, సర్ఫరాజ్, నాగరాజు, షరీఫ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దిష్టిబొమ్మ ఊరేగింపు
మర్పల్లి: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ ఆధ్వర్యంలో మర్పల్లిలో ఆందోళన నిర్వహించారు. తాతా మధు దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రవిందర్, సురేష్, నాగేశ్, అబ్రహం, రవి, పంచలింగాల సురేష్, సర్వేశ్, లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.
డీఎస్పీకి ఫిర్యాదు
నవాబుపేట: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధుపై వెంటనే కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్ డీఎస్పీ అంజయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య, ప్రభాకర్ రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీధర్, ప్రసాద్, దశరథ్, లక్ష్మణ్, సర్పంచులు నర్సింహారెడ్డి, నర్సింలు తదితరులు ఉన్నారు.
బంట్వారంలో..
బంట్వారం: తాత మధు వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ మండల నాయకులు సోమవారం బంట్వారంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


