వెయ్యి రోజులైనా అమలు కాని హామీలు | - | Sakshi
Sakshi News home page

వెయ్యి రోజులైనా అమలు కాని హామీలు

Sep 8 2026 7:21 AM | Updated on Sep 8 2026 7:21 AM

బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ

ఇన్‌చార్జ్‌ శ్రీశైల్‌ రెడ్డి

ఆర్డీఓకు వినతిపత్రం అందజేత

తాండూరు టౌన్‌: అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వంద రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ వెయ్యి రోజులు కావస్తున్నా అమలు చేయలేదని నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇంచార్జి శ్రీశైల్‌ రెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీలు, 420 హామీలు తక్షణమే అమలయ్యేలా చూడాలంటూ ఆర్డీఓ అనితకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు, గ్యారంటీల పేరుతో కల్లబొలి మాటలు చెప్పి కాంగ్రెస్‌ నాయకులు ఓట్లు వేయించుకున్నారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా హామీలు, గ్యారంటీలు అమల్లోకి రాలే దన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా కాంగ్రెస్‌ను ఓడిస్తారన్నారు. ఇప్పటికే గ్రామగ్రామాన ప్రజలకు కాంగ్రెస్‌ బాకీ పడిన సంక్షేమ పథకాలపై బాకీకార్డులతో ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు. కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధుల్లో గ్రామాల్లోకి వెళితే ప్రజలే వారిని నిలదీస్తారన్నారు.

బాధిత కుటుంబానికి

‘సీపీఎస్‌’ చేయూత

పరిగి: కొడంగల్‌ జూనియర్‌ కాలేజీలో పనిచేస్తూ ఇటీవల మృతిచెందిన రంగంపల్లి లెక్చరర్‌ చంద్రశేఖర్‌ కుటుంబానికి తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయూస్‌ యూనియన్‌ అండగా నిలిచింది. సంఘం నాయకులు సోమవారం బాధిత కుటుంబానికి రూ.71,200 అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విజయ్‌ భాస్కర్‌రెడ్డి, నర్సింహరాజ్‌, యాదగిరి, శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌, శ్రీనివాసులు, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement