దాతల సహకారం మరువలేనిది | - | Sakshi
Sakshi News home page

దాతల సహకారం మరువలేనిది

Sep 8 2026 7:21 AM | Updated on Sep 8 2026 7:21 AM

కొడంగల్‌: పట్టణ శివారులో శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు చేస్తున్న సహకారం మరువలేనిదని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు డాక్టర్‌ రవీంద్ర యాదవ్‌, పీ.శ్రీనివాస్‌గౌడ్‌, కానుకుర్తి నర్సిరెడ్డి అన్నారు. అయ్యప్ప స్వామి మూలమూర్తి (విగ్రహం) తయారీలో తమవంతు భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో ఎంతో మంది భక్తులు బంగారం, వెండి, నగదు తమ వంతు సాయంగా విరాళాలు అందిస్తున్నారు. కొడంగల్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు కరెంటు రాములు తన వంతు సాయంగా రూ.1,11,111, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌ రూ.50వేలు, క్రాంతి కృష్ణారావు, సరాఫ్‌ శ్రీనివాసా చారీ, పర్సాపూర్‌ సర్పంచు రాధ శ్రీనివాస్‌రెడ్డి, చిట్టెం నర్సింహ్మరెడ్డి, జగదీశ్‌ కుమార్‌ ఢాగ, శ్రీనివాస్‌ యాదవ్‌, కటుకం పవన్‌కుమార్‌, గంట రాజుగౌడ్‌, ఆవుల శివరాజ్‌, పూరి మధు, పూరి చంద్రశేఖర్‌, చిట్టెం పద్మమ్మ, తాండూరుకు చెందిన కళావతి, ముదేలికి చెందిన జయశ్రీ, బషీరాబాద్‌ చందుచారీ, రుక్మిణి, డాక్టర్‌ సాహితి సంకేత్‌ గౌడ్‌, తారాపురం నాగలింగం, తూం అమృతమ్మ, సురాయిపల్లి కిష్టప్ప, షేక్‌రఫీ, గాండ్ల శ్రీనివాస్‌ గౌడ్‌, బాకారం చంద్రశేఖర్‌, జయశ్రీ రామకృష్ణ గౌడ్‌, కృష్ణవేణి రాజగోపాల్‌ గౌడ్‌, మేడిశెట్టి రవికుమార్‌లు తమ వంతు సాయంగా మూలమూర్తిలో కలపడానికి బంగారం, వెండి అందించారు. ఆలయ నిర్మాణం కోసం చక్రవర్తి మధుసూదన్‌రావ్‌ రూ.లక్ష, అరిగె అనంత ప్రసాద్‌ రూ.25వేలు విరాళం ఇచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. పరిగికి చెందిన ముక్కు నర్సిములు ఆలయ ప్రాంగణం, మండపంలో రూ.3,41,000 ఖర్చుతో గ్రానైట్‌, మార్బల్‌ స్టోన్స్‌ వేయించారు. అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. విరాళాలు ఇస్తామని హామీ ఇచ్చిన భక్తులు సహకరించాలని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement