సమయపాలన ఏదీ? | - | Sakshi
Sakshi News home page

సమయపాలన ఏదీ?

Sep 8 2026 7:21 AM | Updated on Sep 8 2026 7:21 AM

బంట్వారం: ప్రజావాణికి సైతం అధికారులు సమయ పాలన పాటించడం లేదని బీఆర్‌ఎస్‌ కోట్‌పల్లి మండల అధ్యక్షుడు సుందరి అనిల్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎన్నికల హామీలతో పాటు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని కోరుతూ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం ఉదయం 10.30 గంటలకు కోట్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆఫీసుకు తాళం వేసి కనిపించింది. దీంతో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సమయ పాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావాణిలో కాంగ్రెస్‌ ఎన్నికల హమీలు ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తు అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాములు మాజీ సర్పంచ్‌లు వెంకటేశ్‌యాదవ్‌, రాంచందర్‌, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

కొద్దిగా ఆలస్యమైంది

ఈ విషయమై ఎంపీఓ సురేందర్‌రెడ్డిని సంప్రదించగా కొద్దిగా అలస్యమైందన్నారు. అటెండర్‌ దగ్గర తాళాలు ఉండడంతో 10.45 గంటలకు ఆఫీసు తెరిచామన్నారు. యథావిధిగా ప్రజావాణి జరిగిందని, రెండు ఫిర్యాదులు స్వీకరించామని తెలిపారు.

ఉదయం పదిన్నర దాటినా తెరుచుకోని ఎంపీడీఓ కార్యాలయం

ప్రజావాణికి వెళ్లిన

బీఆర్‌ఎస్‌ నేతల అవాక్కు

ఆఫీసు ముందే కూర్చుని ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement