● రూ.1.50 లక్షల పెట్టుబడి బూడిద
● పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదు
బషీరాబాద్: మండల పరిధిలోని మైల్వార్‌లో రేకుల డబ్బా ధ్వసం ఘటన వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన యువకుడు కందనెల్లి నగేశ్ స్వయం ఉపాధి కోసం రూ.1.50లక్షలు వెచ్చించి బస్టాండ్ సమీపంలో జిరాక్స్, స్టేషనరీ షాపు ఏర్పాటు చేశాడు. గత నెలలో షాపు ఏర్పాటుకు సర్పంచ్‌కు రాతపూర్వకంగా దరఖాస్తు చేశానని, పంచాయతీ కార్యదర్శి మౌఖిక సూచనల మేరకే డబ్బా ఏర్పాటు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈ క్రమంలో సర్పంచ్ సీమా సుల్తానా అనుచరులు ప్రారంభానికి ముందే డబ్బాను ధ్వంసం చేశారని ఆరోపించాడు. ఇదిలా ఉండగా అనుమతి లేకుండా డబ్బా ఏర్పాటు చేసి తమపై దాడికి యత్నించాడని సర్పంచ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్‌ఐ విఠల్ గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వాంగ్మూలాలు నమోదు చేసి ఘటనా స్థలిని పరిశీలించారు. దర్యా ప్తు అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.


