ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి

Sep 6 2026 8:25 AM | Updated on Sep 6 2026 8:25 AM

బీజేపీ జిల్లా కన్వీనర్‌

కరణం ప్రహ్లాదదరావు

కుల్కచర్ల: ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేని వని బీజేపీ జిల్లా కన్వీనర్‌ కరణం ప్రహ్లాదద రావు, దిశ జిల్లా కమిటీ సభ్యులు జానకిరాం, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సౌ మ్యారెడ్డి అన్నారు. శనివారం కుల్కచర్ల జెడ్పీ బాలికల పాఠశాల, కేజీబీవీలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మండలంలోని ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అంజిలయ్య పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో

బీఆర్‌ఎస్‌ నాయకులు

కొడంగల్‌: మండల పరిధిలోని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను ముందు జాగ్రత్తగా పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కొంతమందిని గృహ నిర్బందంలో ఉంచారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పట్టణంలోని మున్సిపల్‌ రెండో వార్డు కౌన్సిలర్‌ వాణిశ్రీ యాదవ్‌, మాజీ కౌన్సిలర్‌ మధుయాదవ్‌తో పాటు పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని బొంరాస్‌పేట మండలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నేటి మహాధర్నాను

విజయవంతం చేయాలి

డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌

అనంతగిరి: నగరంలోని ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు జాదవ్‌ ధారాసింగ్‌ నాయక్‌ కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా పాలనలో వెయ్యి రోజుల ప్రగతిని వివరించడంతోపాటు.. ప్రతిపక్ష నేతగా విఫలమైన మాజీ సీఎం కేసీఆర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఏఎంసీ, పీఏసీఎస్‌ చైర్మన్లు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

భాస్కరయోగికి

రాష్ట్ర స్థాయి అవార్డు

పరిగి: పరిగి ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న రచయిత భాస్కరయోగి శనివారం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. కొడంగల్‌ జూనియర్‌ కళాశాలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యోగితారాణా, ఇంటర్‌ విద్యాశాఖ కార్యదర్శి అభిలాష చేతుల మీదుగా పురస్కారం స్వీకరించారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి

అనంతగిరి: మా సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని గెస్ట్‌ లెక్చరర్ల సంఘం జిల్లా ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. కొడంగల్‌ పర్యటనలో ఉన్న ఆయనకు శనివారం వినతిపత్రం అందజేశారు. 12 నెలల తో కూడిన కన్సాలిడేటెడ్‌ పే ఇవ్వాలన్నారు. రెగ్యులర్‌ లెక్చరర్లు లేని చోట అతిథి అధ్యాపకులను నియమించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు గెస్ట్‌ లెక్చరర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement