ధారూరు: సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూజ చేస్తున్న హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి
బొంరాస్‌పేట: కొత్తూరు యూపీఎస్‌లో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లకు సన్మానం
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయుల సేవలను అధికారులు, పాలకులు కొనియాడారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.


