అనంతగిరి: ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విస్మరించిందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. శనివారం పట్టణంలో కాంగ్రెస్ వెయ్యి రోజల పాలనను నిరసిస్తూ యువతీయువకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్‌టీఆర్ చౌరస్తాలో మాట్లాడారు. అధికారం కోసం ఆచరణ సాధ్యం హామీలు ఇచ్చారని ఆరోపించారు. యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలన్నారు. విద్యా భరోసా కార్డు ఏమయ్యిందని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మాట తప్పారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్‌ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ అధ్యక్షుడు శుభప్రద్‌పటేల్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, నాయకులు వేణుగోపాల్, గోపాల్, మైపాల్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, కమాల్‌రెడ్డి, దత్తు, కిశోర్, సుభాన్‌రెడ్డి, షఫీ, మల్లికార్జున్, వేణుగోపాల్‌రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


