బొంరాస్‌పేట: కొడంగల్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభివృద్ధి పనులపై ఆరా తీసినట్లు తెలిసింది. మండలంలోని మహంతీపూర్ వద్ద నిర్మిస్తున్న భారీ వంతెన పనులు, కొత్తూరు – మహంతీపూర్ రోడ్డు, మెట్లకుంట, బొంరాస్‌పేట బీటీ రోడ్లు, బొంరాస్‌పేట –దేవనూర్ రోడ్డు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఓ నాయకుడిని సీఎం ఆప్యాయంగా పలకరిస్తూ చేపల పులుసు ఎప్పుడు తినిపిస్తావ్ అన్నా అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు వెంకట్రాములుగౌడ్, రాంచంద్రారెడ్డి, మల్లేశ్, మల్లికార్జున్, దేశ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.


