అలరించిన బాలగోపాలం | - | Sakshi
Sakshi News home page

అలరించిన బాలగోపాలం

Sep 6 2026 8:25 AM | Updated on Sep 6 2026 8:25 AM

కొడంగల్‌ రూరల్‌: పట్టణంలోని బ్రాహ్మణవాడలో వెలసిన అతి ప్రాచీన కేశవస్వామివారి ఆలయంలో శనివారం శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4గంటల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు బాలగోపాలం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు ఎంతగానో అలరించారు. ప్రతిభ చూపిన అచ్యుతాకృష్ణ, డి.జ్యోత్స్న, హేమంత్‌ అద్వత్‌, సభాపతి అమ్యుక్తా, కొండేటి శ్రేష్ట, గాండ్ల అపూర్వ, చిట్టెపు నేహంత్‌రెడ్డి, మాన్విక్‌ నరేష్‌కుమార్‌కు ఉమిద్‌వార్‌ మాణిక్యమ్మ ట్రస్ట్‌ ఆధ్వరయంలో మురారీ వషిష్ట కుటుంబ సభ్యులు ఒకొక్కరికి ఐదు గ్రాముల చెప్పొన వెండి పతకాలు బహూకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement