తాండూరు: నేటి విద్యార్థులే రేపటి దేశ నిర్మాతలని ఆర్‌బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని సరస్వతి విద్యాపీఠం, శిశుమందిర్ విద్యాలయాల్లో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి హాజరై పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం స్కూల్‌లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.5లక్షల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సరస్వతీ విద్యాపీఠం జిల్లా అధ్యక్షు డు మల్లేశం, పాఠశాల అధ్యక్షుడు కట్కం విరేందర్, మున్సిపల్ కౌన్సిలర్ జుంటిపల్లి వెంకట్, యాజమాన్య కమిటీ సభ్యులు అనంత్‌రెడ్డి, రాంరెడ్డి, నరేందర్‌రెడ్డి, రామకృష్ణ తదితరులు ఉన్నారు.


