● ప్రతిపక్ష నేతల మండిపాటు
● సీఎం పర్యటన నేపథ్యంలో పలువురి ముందస్తు అరెస్ట్
బొంరాస్‌పేట: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కొడంగల్ పర్యటన నేపథ్యంలో బొంరాస్‌పేట, దుద్యాల తదితర మండలాలకు చెందిన ప్రతిపక్ష, మిత్రపక్ష పార్టీల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం నాయకులు, ఇతర పార్టీల సర్పంచ్‌లు ఉన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, మానవ హక్కులను హరించడమేనని దుద్యాల మండలం చెట్టుపల్లితండా సర్పంచు గోపాల్ మండిపడ్డారు. శనివారం సాయంత్రం పోలీసులు వీరిని విడుదల చేశారు. వీరిలో సీపీఐ నాయకులు ఎండీ మహెమూద్, సురేశ్‌గౌడ్, చెట్టుపల్లితండా సర్పంచ్ ముడావత్ గోపాల్, దౌల్తాబాద్ మండల నాయకుడు మూతల రాజు, నీటూరు మాజీ సర్పంచు సున్నపు వెంకటప్ప, వ్యవసాయ కార్మిక సంఘం ఎండీ రహీమ్, ఎండీ రఫీక్ తదితరులు ఉన్నారు. బొంరాస్‌పేట మండల శివారులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.


