● ఇదీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన
● కొడంగల్ మాజీ ఎమ్మెల్యే
పట్నం నరేందర్‌రెడ్డి
బొంరాస్‌పేట: సీఎం జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ బీఆర్‌ఎస్ నేతలను అరెస్టు చేయడం సరికాదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మెట్లకుంట గేటు వద్ద విలేకరులతో మాట్లాడారు. చారాణా అభివృద్ధి.. బారాణా దోపిడీ అన్న చందంగా కాంగ్రెస్ ప్రజాపాలన సాగుతోందని ఆరోపించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో సమస్యలు తిష్ట వేశాయని, ప్రజల కష్టాలను సీఎం దృష్టికి తెచ్చేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టాలను సీఎంకు చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు మహేందర్‌రెడ్డి, కోట్ల యాదగిరి, చాంద్‌పాషా, సలామ్, మహేందర్, రవిగౌడ్, మల్లేశ్‌గౌడ్ విశాల్ తదితరులు పాల్గొన్నారు.


