తాండూరు: మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులను హెచ్చరించారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తాండూరులోని వనరులను కొడంగల్‌కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. నర్సింగ్ విద్య తాండూరు విద్యార్థులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో నాడు రోహిత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపించి నర్సింగ్ కళాశాల భవనాన్ని నిర్మించారని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి నర్సింగ్ కళాశాల భవనాన్ని కొడంగల్‌కు తాకట్టు పెట్టి, కొడంగల్ మెడికల్ కళాశాల నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కొడంగల్ కోసం జిల్లా ఆస్పత్రిని కూడా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తాండూరు ప్రజలకు కాగ్నానది నీటిని సరఫరా చేయకుండా కొడంగల్‌కు నీటి సరఫరా చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యాడన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఇర్షద్, సురేష్‌నాయక్, అనిల్‌అర్మి, మాజీ కౌన్సిలర్లు ఆసిఫ్, నాయకులు సంతోష్‌గౌడ్, రుద్రపటేల్, కరుణాకర్, ఏజాజ్, అనంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు


