రేపు లక్ష బిల్వార్చన పూజ | - | Sakshi
Sakshi News home page

రేపు లక్ష బిల్వార్చన పూజ

Sep 5 2026 7:25 AM | Updated on Sep 5 2026 7:25 AM

రేపు లక్ష బిల్వార్చన పూజ బీఎల్‌ఏలు కీలక పాత్ర పోషించాలి సేవా భావంతో పనిచేయాలి బీజేపీ నేతల బైండోవర్‌ చిరుత కలకలం

ధారూరు: మండల కేంద్రంలోని వీరభద్రేశ్వర ఆలయంలో కపిలేశ్వర స్వామికి ఆదివారం లక్ష బిల్వార్చన పూజ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూజలో పాల్గొనే భక్తులు పత్రి దళాలు తెచ్చుకోవాలని సూచించారు. ఉదయం 8 గంటలకు దీపారాధన, వినాయక, కుమారస్వామి, నందీశ్వర, వీరభద్రేశ్వర, పార్వతీమాత, నవగ్రహాలకు పూజలు, 9:30 గంటలకు మహా గణపతి పూజ, రుద్రాభిషేకం, అలంకరణ, 10:30 గంటలకు లక్ష బిల్వార్చన పూజ, 11:55 గంటలకు స్వామి అమ్మవారి కల్యాణం, అనంతరం మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు పల్లకీ సేవతో వేడుకలు ముగుస్తాయన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్‌

అనంతగిరి: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో బీఎల్‌ఏల పాత్ర కీలకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం వికారాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సర్‌ రెండో విడతపై ముఖ్య నాయకులు, కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటరు జాబితాలో అర్హులైన వారందరి పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలన్నారు. నోటీసు అందుకున్న వారికి అవగాహన కల్పించాలన్నారు. ఓ ఒక్కరి ఓటు పోకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, రాష్ట్ర నాయకులు శివరాజు, పాండుగౌడ్‌, కేపీ రాజు, వడ్ల నందు, నవీన్‌కుమార్‌, అనిల్‌యాదవ్‌, రాములు, భద్రేశ్వర్‌, కృష్ణ ముదిరాజు, కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా కన్వీనర్‌ కరణం ప్రహ్లాదరావు

కుల్కచర్ల: ప్రవేటు వైద్యశాలలు సేవా భావంతో పనిచేయాలని బీజేపీ జిల్లా కన్వీనర్‌ కరణం ప్రహ్లాదరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో తులసీ హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల పరిస్థితులను గ్రహించి వారికి ఇబ్బంది లేకుండా వైద్యసేవలు అందించాలన్నారు. కార్పొరేట్‌ స్థాయి వైద్యం ఒకే దగ్గర అందించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అంజిలయ్య, దిశ కమిటీ జిల్లా సభ్యులు జానకీరాం, గోరిగడ్డ తండా మాజీ సర్పంచ్‌ నీలి బాయి, సేవాలాల్‌ సేన మండల అధ్యక్షులు అంగూర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

కుల్కచర్ల: సీఎం వచ్చిన ప్రతీసారి ఇతర పార్టీల నేతలను అదుపులోకి తీసుకోవడం ఎంటని దిశ జిల్లా కమిటీ సభ్యులు జానకిరాం చౌహాన్‌ ప్రశ్నించారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో బీజేపీ స్థానిక నేతలను బైండోవర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి జరగాలన్నదే బీజేపీ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కుల్కచర్ల సర్పంచ్‌ అంజిలయ్య, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మైపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

కుల్కచర్ల: మండలంలోని ముజాహిద్‌పూర్‌లో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆర్‌.నర్సింలు పొలానికి వెళ్తుండగా చిరుతపులి కనిపించింది. భయాందోళనతో గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. అప్పటికే చిరుత సమీప అడవిలోకి వెళ్లినట్లు గుర్తించారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement