తాగునీటి కోసం ధర్నా | - | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం ధర్నా

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

తాగునీటి కోసం ధర్నా ఊరేగింపులకు అనుమతి లేదు రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు పనిచేసే చోటే కుప్పకూలి మేసీ్త్ర మృతి

తాండూరు రూరల్‌: పెద్దేముల్‌ మండలం కందనెల్లితండాలో గిరిజనులు తాగునీటి కోసం రోడ్డెక్కారు. మంగళవారం తాండూరు–సంగారెడ్డి ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కందనెల్లి తండాలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై సర్పంచ్‌ను ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. అధికారులు కల్పించుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఎంపీడీఓ హామీతో ధర్నా విరమించారు.

తాండూరు టౌన్‌: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కొనుగోలు చేసి తీసుకువస్తున్న వినాయక విగ్రహాల ఊరేగింపునకు ఎలాంటి అనుమతులు లేవని పట్టణ సీఐ పరమేశ్వర్‌ గౌడ్‌ అన్నారు. విగ్రహాల ప్రతిష్ట కోసం సాదాసీదాగా ప్రతిమలను తెచ్చి మండపంలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమతి లేకుండా ఊరేగింపు నిర్వహిస్తే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

తాండూరు రూరల్‌: జీవితంపై విరక్తిచెంది ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బేగంపేట్‌ రైల్వే స్టేషన్‌ వద్ద సోమవారం చోటు చేసుకుంది. మృతుడు తాండూరు మండలం అంతారం వాసిగా పోలీసులు గుర్తించారు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొర్ర నాగప్ప (35) భార్యాపిల్లలతో కలిసి బాల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద నివాసముంటున్నాడు. సోమవారం సాయంత్రం బేగంపేట్‌ స్టేషన్‌ సమీపంలో రైలు వస్తుండగా, కింద పడ్డాడు. మృతుడి వద్ద ఉన్న ఆధార్‌ కార్డు సాయంతో రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తిచేశారు.

కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడపాలి

రౌడీ షీటర్లకు ఎస్‌ఐ భరత్‌రెడ్డి కౌన్సెలింగ్‌

పూడూరు: ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశాల మేరకు చన్గోముల్‌ ఎస్‌ఐ భరత్‌రెడ్డి మంగళవారం రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని సూచించారు. పోలీసుల సూచనలు పాటిస్తూ కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితం గడపాలన్నారు. జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో భాగంగా రౌడీషీటర్ల కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు.

మొయినాబాద్‌: బతుకుదెరువుకోసం భార్యపిల్లతో వలస వచ్చిన ఓ మేసీ్త్ర పనిచేసే చోటే కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎనికేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి చెందిన బుధ్రం సత్నామి (54) నెల రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి మొయినాబాద్‌ ప్రాంతానికి వలస వచ్చాడు. మున్సిపల్‌ పరిధిలోని ఎనికేపల్లిలో ఉన్న వనమ్‌ విల్లాస్‌లో మేస్త్రిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పనిచేస్తూ సత్నామి తల తిరుగుతోందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్నవారు చికిత్స నిమిత్తం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. గుండెపోటుతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement