సీఎం చిత్రపటానికి పాలాభిషేకం | - | Sakshi
Sakshi News home page

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

తాండూరు టౌన్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చిత్రపటానికి తెలంగాణ ఉద్యమకారులు మంగళవారం పట్టణంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వారికి తగిన న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆదిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. కేకే కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా త్వరలోనే ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలంతో పాటు పలు బెనిఫిట్స్‌ కల్పిస్తామని సీఎం ప్రకటించడం అభినందనీయమన్నారు. మేనిఫెస్టోలో ఉద్యమకారుల సంక్షేమం కోసం పొందుపరిచిన హామీలను ప్రభుత్వం నెరవేరస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సంజయ్‌గౌడ్‌, కో ఆర్డినేటర్‌ జిలాని, ప్రకాశ్‌గౌడ్‌, శివకుమార్‌, అశోఖ్‌, మోయిజ్‌ బేగ్‌, వెంకటయ్య, ధన్‌రాజ్‌, శ్రీను, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ప్రకటనపై తెలంగాణ ఉద్యమకారుల హర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement