● సంస్థ టెక్నికల్ ఇంజనీర్ శ్రీకాంత్
● సెంట్రింగ్ మేసీ్త్రలకు బీమా బాండ్ల అందజేత
పరిగి: సిమెంట్ రంగంలో తిరుగులేని శక్తిగా వికాట్ గ్రూప్‌కి చెందిన భారతి సిమెంట్ ఎదుగుతోందని సంస్థ టెక్నికల్ ఇంజనీర్ శ్రీకాంత్ తెలియజేశారు. మంగళవారం కుల్కచర్ల మండల కేంద్రంలో శ్రీలక్ష్మి చెన్నకేశవ ట్రేడ్ డీలర్ షాప్‌లో సెంట్రింగ్ మేసీ్త్రల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్‌తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. భవనాల స్లాబులు, బ్రిడ్జిలు, రహదారుల ఏర్పాటుకు భారతి సిమెంట్ సరైన ఎంపిక అని వివరించారు. అనంతరం 25 మంది తాపీ మేసీ్త్రలకు లక్ష రూపాయల ప్రమాద బీమా బాండ్లను అందజేశారు. డీలర్ గోపాల్ మాట్లాడుతూ.. భారతి సిమెంట్ సర్వీసు వేగవంతంగా ఉంటుందని, త్వరితగతిన స్పందించి టెక్నికల్ సాయం అందజేస్తారని పేర్కొన్నారు.


