కక్షపూరిత చర్యలు మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కక్షపూరిత చర్యలు మానుకోవాలి

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

అనంతగిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై కక్షపూరిత చర్యలు మానుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి అన్నారు. లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను నిరసిస్తూ, ఉత్తరాఖాండ్‌లో జరిగిన ఘటనకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు మంగళవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు జాదవ్‌ ధారాసింగ్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న రాహుల్‌గాంధీపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. కేసులకు భయపడేది లేదన్నారు. కాంగ్రెస్‌తోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీ, కాక్రోచ్‌ ఉద్యమంతో బీజేపీ క్రమంగా బలహీనమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం అనన్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌లు శ్రీనివాస్‌ ముదిరాజు, వడ్డే శ్రీనివాస్‌, భాస్కర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు కిషన్‌నాయక్‌, సత్యనారాయణ, మైపాల్‌రెడ్డి, ఉత్తమ్‌చంద్‌, అమీర్‌ అబ్దుల్లా, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సతీశ్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సంతోష, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఖాజా సలావుద్దీన్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు రాజు, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీ ప్రతినిధులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement