● పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలి
● కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ జేఏసీ నిరసన
అనంతగిరి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వికారాబాద్ జిల్లా ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి, భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినంగా అభివర్ణించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేసి, న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. పెండింగ్ ఏలను వెంటనే ప్రకటించాలని కోరారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ జిల్లా ప్రఽతిఽనిధులు అజ్మత్ పాషా, సత్తార్, నర్సింలు, వెంకటరత్నం, ఆనంద్, శుక్రవర్ధన్‌రెడ్డి, రమేష్, బాలు, అరుణ్‌కుమార్, బాలకృష్ణ, శారద, శ్రీల, సీత, అనురాధ తదితరులు పాల్గొన్నారు.


