మహాసభలను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహాసభలను విజయవంతం చేయాలి

Sep 4 2026 7:17 AM | Updated on Sep 4 2026 7:17 AM

● ఎమ్మార్పీఎస్‌ రంగారెడ్డిఇన్‌చార్జి ఉపేందర్‌ మాదిగ

షాబాద్‌: ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్‌ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి రాగల్ల ఉపేందర్‌ మాదిగ అన్నారు. గురువారం మండల పరిధిలోని నాగర్‌గూడ పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్‌ మండల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన, అణగారిన వర్గాల ఆర్థిక ఎదుగుదలకు, కుల వివక్షత, సాంఘిక అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. మహనీయుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలను గుర్తించి ఉద్యమా లు చేపట్టాలని సూచించారు. గ్రామస్థాయిలో ఎమ్మార్పీఎస్‌ ఉద్యమాన్ని బలోపేత చేయాలన్నా రు. ఈ నెల 9న వరంగల్‌లో జరిగే జాతీయ మహా సభకు అందరూ తరలివచ్చి విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏట్లఎర్రవల్లి సర్పంచ్‌ శంకర్‌, ఎంఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షుడు రావుగళ్ల బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకులు తదితరులు ఉన్నారు.

ఎమ్మార్పీఎస్‌ మండల కమిటీ ఎన్నిక

మండల ఎమ్మార్పీఎస్‌ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఉపేందర్‌ మాదిగ తెలిపారు. అధ్యక్షుడిగా మల్కి ప్రవీణ్‌, అధికార ప్రతినిధిగా ఎస్‌. రమేశ్‌, ప్రధాన కార్యదర్శిగా జే.ఆనందం, ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్‌ను ఎన్నుకున్నారు. అదేవిధంగా ఎంఎస్పీ మండల కమిటీ అధ్యక్షుడిగా అశో క్‌, అధికార ప్రతినిధిగా యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా దయాకర్‌ను ఎన్నుకున్నారు. ఎంఎస్‌ఎఫ్‌ మండల కమిటీ అధ్యక్షుడిగా నర్సింలు, అధికార ప్రతినిధిగా ఎం.అనిల్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్‌, జగన్‌ తదితరులను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement