షాద్‌నగర్: మండల పరిధిలోని లింగారెడ్డిగూడలో గురువారం స్మార్ట్ రేషన్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వారు రేషన్‌కార్డులు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగయ్య, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, సర్పంచ్ ప్రవీణ్, ఉపసర్పంచ్ అశోక్, నాయకులు చెంది తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ రేషన్‌కార్డులు
కొందుర్గు: అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు అందిస్తున్నామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం ఆయన కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండల కేంద్రాల్లో తహసీల్దార్లు ఆజాంఅలీ, జగదీశ్వర్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. అదేవిధంగా చౌదరిగూడ ఉన్నత పాఠశాలలో ఆయన వాటర్‌ఫిల్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు కనీసం ఒక్క రేషన్‌కార్డులు ఇచ్చిన పాపన పోలేదన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పురుషోత్తంరెడ్డి, చంద్రశేఖర్, నాయకులు పాల్గొన్నారు.


