సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

Sep 1 2026 7:41 AM | Updated on Sep 1 2026 7:41 AM

షాద్‌నగర్‌: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలోని ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం కొప్పునూరి శ్రీశైలం పదవీ విరమణ కార్యక్రమాన్ని సోమవారం పట్టణంలోని కేకేఆర్‌ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాలశ్రవణ్‌ ముఖ్య అతిథిగా హాజరై, శ్రీశైలం దంపతులను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమన్నారు. విద్యారంగాభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శశిరేఖ యాదయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement