పరిగి: ఉత్తమంగా విధులు నిర్వహించిన ఉద్యోగులను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ నాయక్ అన్నారు. చౌడాపూర్ మండలం కొత్తపల్లి గ్రామపరిధి గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల ప్రత్యేకాధికారి బసప్ప సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా బసప్పను సన్మానించి మాట్లాడారు. సమాజంలో వెలకట్టలేనిది ఒక్క ఉపాధ్యాయ వృత్తేనని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ రాంచందర్, వసతిగృహ ప్రత్యేకాధికారులు రాజన్న, రాజు, బాలవరలక్ష్మి, సబితారాణి, గోవింద్, కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి, దిశ కమిటీ జిల్లా సభ్యులు జానకిరాం, టెలికాం అడ్వైజరి కమిటీ సభ్యులు ఘణపురం వెంకటయ్య, బ్లాక్ బి అధ్యక్షుడు భరత్‌కుమార్, అంబేడ్కర్ సంఘం మండల నాయకులు అశోక్‌కుమార్, స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


