దోమ: పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యమని పీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం తిమ్మాయిపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. తమ ఏళ్ల నాటి కలను నిజం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అండగా నిలిచిన టీఆర్‌ఆర్‌కు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్‌కుమార్, దోమ సర్పంచ్ మాలి శివకుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కుల్కచర్ల: అర్హుందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అశోక్‌కుమార్ అన్నారు. ఆదివారం వారు చౌడాపూర్ మండల పరిధిలోని చాకల్‌పల్లి, కల్మన్‌కాల్వ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


