సెక్రటేరియట్‌ ముట్టడిని విజయవంతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

సెక్రటేరియట్‌ ముట్టడిని విజయవంతం చేద్దాం

Aug 31 2026 7:58 AM | Updated on Aug 31 2026 7:58 AM

సెక్రటేరియట్‌ ముట్టడిని విజయవంతం చేద్దాం ఫుట్‌బాల్‌ పోటీల్లో బొంరాస్‌పేట జట్టు సత్తా వెంకట క్రాంతి కిరణ్‌కు గిడుగు జాతీయ పురస్కారం కడ్తాల్‌: మండల పరిధిలోని రావిచేడ్‌కు చెందిన న్యాయ నిపుణుడు, సంఘ సేవకుడు, కవి పుట్టపాక వెంకట క్రాంతి కిరణ్‌ ప్రతిష్టాత్మక గిడుగు జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకు ని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కు నిర్వాహకులు పురస్కారం అందజేశారు. ఫోన్‌ వాడొద్దన్నందుకు.. అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ఆదివాసీ కాంగ్రెస్‌ పరిశీలకుడి నియామకం షాద్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్‌ కమిటీల బలోపేతం, ఎన్నిక ప్రక్రియ కోసం జిల్లా కమిటీలకు పరిశీలకులను నియమించా రు. ఇందులో భాగంగా షాద్‌నగర్‌కు చెందిన గిరిజన నేత శ్రీను నాయక్‌ను వనపర్తి జిల్లా పరిశీలకుడిగా నియమించారు. ఈ మేరకు పీసీసీ ఆదివాసీ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్సీ శంకర్‌ నాయ క్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివాసీ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా చైర్మన్‌తో పాటు, నియోజకవర్గంలో మండల స్థాయి అధ్యక్షులను ఎన్నుకునేందుకు తనను అధిష్టానం పరిశీలకుడిగా నియమించినట్లు శ్రీను నాయక్‌ తెలిపారు.

మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌

కుల్కచర్ల: మాలలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశ్‌ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మాలలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 31న సెక్రటేరియేట్‌ ముట్టడించేందుకు రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా పరిధిలోని మాలమహానాడు కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

జట్టు సభ్యులను అభినందించిన రవికుమార్‌

బొంరాస్‌పేట: జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన ఫుట్‌బాల్‌ పోటీల్లో బొంరాస్‌పేట జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టుకు బొంరాస్‌పేటకు చెందిన గండీడు రవికుమార్‌ రూ.15 వేలు నగదు బహుమతి అందజేసి అభినందించారు.

యువతి బలవన్మరణం

అనంతగిరి: ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన వికారాబాద్‌ పట్టణంలోని రాజీవ్‌గృహకల్పలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ రఘుకుమార్‌ తెలిపిన ప్రకారం.. రాజీవ్‌గృహకల్పకు చెందిన ప్రీతి(20) ఇటీవల ఐటీఐ పూర్తి చేసింది. అవుట్‌సోర్సింగ్‌లో హైదరాబాద్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఎక్కువగా మొబైల్‌ వినియోగిస్తుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చేవెళ్ల: అంగన్‌వాడీల్లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్ట్‌ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందని చేవెళ్ల ఐసీడీఎస్‌ సీడీపీఓ హెప్సిబా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలోని చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్‌, మొయినాబాద్‌ మండలాల్లో మొత్తం 29 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈనెల 31 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే సమర్పించాలని కోరారు. ఖాళీల వివరాలు, అర్హతలు, నియమ నిబంధనలు, పూర్తి వివరాలకు మహిళా శిశుసంక్షేమశా అధికార వెబ్‌సైట్‌ https://wdcw.tg.nic.in ను సందర్శించాలని సూచించారు.

మూడు పోస్టుల భర్తీకి..

అబ్దుల్లాపూర్‌మెట్‌: మండల పరిధిలోని కవాడిపల్లి అంగన్‌వాడీ సెంటర్‌ –1, 2తో పాటు తారమతిపేటలోని అంగన్‌వాడీ సెంటర్‌ –2లో ఉన్న మూడు అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హయత్‌నగర్‌ సీడీపీఓ వినీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement