తాండూరు: కాంగ్రెస్ సర్కారు వేయిరోజుల పాలనలో నెలకొన్న వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి 10 వరకు సమరభేరి కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చేపట్టనున్న నిరసన కార్యక్రమంపై ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, ఆరు గ్యారెంటీలు, హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో, గ్రామాల్లో సైతం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమానికి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 2 నుంచి 10 వరకు కార్యక్రమాలు
బీఆర్‌ఎస్ శ్రేణులకు రోహిత్‌రెడ్డి దిశానిర్దేశం


