● మరొకరికి తీవ్రగాయాలు
● మృతుల్లో నర్సాపూర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు
కొడంగల్ రూరల్: ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని చిట్లపల్లి– అయినన్‌పల్లి మధ్యలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్ మండలం నర్సాపూర్ చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేష్, నీటూరుకు చెందిన తన స్నేహితుడు భీమేష్‌తో కలిసి వ్యక్తిగత పని నిమిత్తం కొడంగల్‌కు వచ్చారు. పని ముగించుకొని తిరిగివెళ్తున్న క్రమంలో కర్ణాటక నుంచి బైక్‌పై కొడంగల్ వైపు వస్తున్న ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి వీరి భైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కర్ణాటక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలపాలైన రమేష్, భీమేష్‌ను టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే రమేష్ మృతి చెందాడు. భీమేష్‌ను ఆస్పత్రికి తరలించి, తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


