1 నుంచి రాత్రి బస్సులు | - | Sakshi
Sakshi News home page

1 నుంచి రాత్రి బస్సులు

Aug 29 2026 7:15 AM | Updated on Aug 29 2026 7:15 AM

1 నుంచి రాత్రి బస్సులు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్‌ 1 నుంచి రాత్రి బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు వివిధ మార్గాల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఆయా రూట్లు, వేళలు ఇలా ఉన్నాయి..

రూట్‌ నంబర్‌ 222 ఏ

కోఠీ నుంచి అబిడ్స్‌, లక్డీకాపూల్‌, బషీర్‌బాగ్‌, ఉస్మానియా యూనివర్సిటీ, గుట్టలబేగంపేట్‌, కొండాపూర్‌, కోకాపేట తదితర ప్రాంతాల మీదుగా పటాన్‌చెరు వరకు ఈ సర్వీసు నడుస్తుంది. మొత్తం నాలుగు బస్సులు అందుబాటులో ఉంటాయి. కోఠీ నుంచి మొదటి బస్సు రాత్రి 11.40 గంటలకు బయలుదేరుతుంది. చివరి బస్సు 4.30 గంటలకు బయలుదేరుతుంది. పటాన్‌చెరు నుంచి మొదటి బస్సు రాత్రి 11, చివరి బస్సు ఉదయం 4.55 గంటలకు బయలుదేరుతాయి. ప్రతి 45 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటుంది.

రూట్‌ నంబర్‌ 218

సీబీఎస్‌, కోఠీ, లక్డీకాపూల్‌, ఎన్‌ఆర్‌ నగర్‌, పంజాగుట్ట, కేపీహెచ్‌బీ, మియాపూర్‌, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా నడుస్తాయి. అఫ్జల్‌గంజ్‌ నుంచి మొదటి బస్సు రాత్రి 11.25కు, చివరి బస్సు ఉదయం 3.05 గంటలకు బయలుదేరుతాయి. పటాన్‌చెరు నుంచి రాత్రి 11.20కి మొదటి బస్సు, ఉదయం 3.15 గంటలకు చివరి బస్సు బయలుదేరుతాయి. ప్రతి 1.15 గంటలకో బస్సు ఉంటుంది.

రూట్‌ నంబర్‌ 219

సికింద్రాబాద్‌ నుంచి పటాన్‌చెరు మధ్య ప్యారడైజ్‌, ట్యాంక్‌బండ్‌, బోయిన్‌పల్లి, బాలానగర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా ఈ బస్సులు నడుస్తాయి. సికింద్రాబాద్‌ నుంచి మొదటి బస్సు రాత్రి 11.20కి, చివరి బస్సు ఉదయం 3 గంటలకు, పటాన్‌చెరు నుంచి రాత్రి 11.25కు, చివరి బస్సు ఉదయం 3 గంటలకు అందుబాటులో ఉంటా యి. ప్రతి 1.10 గంటలకో సర్వీసు నడుస్తుంది.

రూట్‌ నంబర్‌ 290యూ

హయత్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ మధ్య వనస్థలిపురం, ఎల్‌బీనగర్‌, నాగోల్‌, నాగోల్‌ మెట్రో, స్టేషన్‌ ఎన్‌జీఆర్‌ఐ, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్‌, రసూల్‌పురా, జేబీఎస్‌ తదితర ప్రాంతాల మీదుగా నడుస్తాయి. హయత్‌నగర్‌ నుంచి మొదటి బస్సు రాత్రి 11.20కి, చివరి బస్సు ఉదయం 3 గంటలకు, సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11.25కు, చివరి బస్సు ఉదయం 3 గంటలకు నడుస్తాయి. ప్రతి 1.15 గంటలకో ఒక బస్సు ఉంటుంది.

రూట్‌ నంబర్‌ 195 డబ్ల్యూ

బాచుపల్లి నుంచి వేవ్‌రాక్‌ మధ్య విప్రో సర్కిల్‌, ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌, జేఎన్‌టీయూ, బయోలాజికల్‌ సిటీ, ఈఎస్‌ఐసీ, ఇంద్రానగర్‌ తదితర ప్రాంతాలను కలుపుతూ సర్వీసులు ఉంటాయి. బాచుపల్లి నుంచి మొదటి బస్సు రాత్రి 9.15కు, చివరి బస్సు ఉదయం 3.10 గంటలకు బయలుదేరుతాయి. వేవ్‌రాక్‌ నుంచి రాత్రి 10.25, ఉదయం 4.25 గంటలకు బయలుదేరుతాయి. ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.

రూట్‌ నంబర్‌ 10హెచ్‌

కొండాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌ పోలీస్‌ లైన్స్‌, ఆర్జే కాలేజ్‌ తదితర ప్రాంతాల మీదుగా సర్వీసులు నడుస్తాయి. కొండాపూర్‌ నుంచి రాత్రి 10.55కు, చివరి బస్సు ఉదయం 3.40 గంటలకు, సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 10.50కు, చివరి బస్సు ఉదయం 3.40 గంటలకు నడుస్తాయి. ప్రతి 50 నిమిషాలకో సర్వీస్‌ అందుబాటులో ఉంటుంది.

వేళలు ప్రకటించిన గ్రేటర్‌ ఆర్టీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement