● రాంగ్ రూట్‌లో వచ్చి ఫార్చూనర్‌ను
ఢీకొట్టిన క్వాలిస్
● మన్నెగూడ బైపాస్ వద్ద ఘటన
పూడూరు: రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొని పలువురికి గాయలైన సంఘటన చన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఫార్చూనర్ కారును మన్నెగూడ బైపాస్ వద్ద హైదరాబాద్ నుంచి పరిగి వైపు వెళ్తున్న క్వాలిస్ రాంగ్‌రూట్‌లో ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఎం.కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


