అనంతగిరి: పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫీజు బకాయిల కారణంగా వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్లనందు, అసెంబ్లీ సీనియర్ నాయకులు శ్రీధర్‌రెడ్డి, వివేకానందరెడ్డి, సురేందర్‌బాబు, అనిల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్


