జ్ఞాన మార్గదర్శి భగవద్గీత | - | Sakshi
Sakshi News home page

జ్ఞాన మార్గదర్శి భగవద్గీత

Aug 22 2026 7:19 AM | Updated on Aug 22 2026 7:19 AM

● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్‌

పరిగి: ప్రపంచానికి భగవద్గీత జ్ఞాన మార్గ దర్శి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం పరిగి పట్టణంలో పలువురికి భగవద్గీత గ్రంథాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మానవాళికి జ్ఞానం, ధర్మం, కర్తవ్యబోధన అందిస్తూ సరై న మార్గంలో నడిపించేదే భగవద్గీత అన్నారు. భవిష్యత్‌ తరాలకు గ్రంథ సందేశాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షురాలు అనసూ య, నాయకులు నరసింహ, కేశవులు, అనుష బాబ్జీ, రాంరెడ్డి, రాఘవేందర్‌ గౌడ్‌, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు న్యాయం చేయాలి

అనంతగిరి: నిషేధిత జాబితా(22ఏ)లో తప్పుగా భూమి చేర్చడంతో రైతులు, భూ యాజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే చ ర్యలు చేపట్టి న్యా యం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ పిలిపు మేరకు కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ స్వర్ణలతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిషేధిత భూముల జాబితాలో తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement