నమోదు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

నమోదు వేగవంతం చేయండి

Aug 22 2026 7:19 AM | Updated on Aug 22 2026 7:19 AM

● కలెక్టర్‌ దీపక్‌ తివారి

అనంతగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమో దు ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా ఎఫ్‌ఎల్‌ఎన్‌ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అన్ని మండలాల ఎంఈఓలతో సమీక్ష స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా ర్థుల ఎన్‌రోల్‌మెంట్‌, ఆధార్‌ నమోదు, అనుసంధానం, ఆఫర్‌ జనరేషన్‌, ఎఫ్‌ఎల్‌ఎన్‌ ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంఈఓలు ప్రతి నెలా కనీసం 15 పాఠశాలలను సందర్శించాలన్నారు. బోధన, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ఎఫ్‌ఎల్‌ఎన్‌ ప్రగతిని పరిశీలించాలని తెలిపారు.అనంతరం ఇందుకు సంబంధించిన వా ల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఈ ఓ అబ్దుల్‌ ఘని, ఎంఈఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement