ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

Jul 28 2026 7:14 AM | Updated on Jul 28 2026 7:14 AM

పేకాటరాయుళ్ల అరెస్టు అంబేడ్కర్‌ నేషనల్‌ అవార్డు అందజేత

బషీరాబాద్‌: ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆదివారం తెల్లవారుజామున బషీరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని మైల్వార్‌ గ్రామానికి చెందిన మున్నూర్‌ శామప్ప మైల్వార్‌ వాగు నుంచి అర్ధరాత్రి ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తుంటే నిఘాపెట్టిన పోలీసులు పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న శ్యామప్పపై కేసు నమోదు, ట్రాక్టర్‌ను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ విఠల్‌ తెలిపారు.

యాచారం: పేకాడుతున్న ఏడుగురిని యాచారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ మధు కథనం ప్రకారం.. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన జోగు కృష్ణయ్య, తాండ్ర లింగం, నారిమల్ల రమేష్‌, ఇస్లావత్‌ అరుణ్‌, గుర్రం రంజిత్‌, గడ్డం యాదయ్య, బోయపల్లి లింగం ఆదివారం యాచారంలోని ఓ ప్రాంతంలో పేకాడుతుండగా పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు వారి నుంచి మూడు మోటార్‌సైకిళ్లు, రూ.13 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

షాబాద్‌: రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయన చేసిన సేవలు మరువలేనివని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, మంత్రి అట్లూరి లక్ష్మణ్‌ అన్నారు. ఆదివారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని సీతారాంపూర్‌ గ్రామానికి చెందిన చెన్నయ్య వారి చేతుల మీదుగా అంబేడ్కర్‌ నేషనల్‌ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్రీయ అధ్యక్షుడు గౌతమ్‌ మల్లేశ్‌, డాక్టర్‌ రాజు, మణీ, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

వీర జవాన్లకు దత్తాత్రేయ నివాళి

ముషీరాబాద్‌: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా భారత మాత కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఘన నివాళులు అర్పించారు. రామ్‌ నగర్‌లోని ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో జవాన్ల సేవలను కొనియాడారు. వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయడం, దేశభక్తి స్ఫూర్తిని యువతలో పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

చిన్నారులకు అండగా ప్రభుత్వం

మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

మల్లాపూర్‌: మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారుల విషయంలో తల్లిదండ్రులతో పాటు సమాజం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి దామోదర్‌ రాజనర్సింహా అన్నారు. ఆదివారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో సాధన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్‌ (సాధన ఫౌండేషన్‌)కు చెందిన మానసిక దివ్యాంగ చిన్నారులు, సంస్థ ప్రతినిధులు మంత్రిని కలిశారు. మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు, ప్రత్యేక విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థలను రూపొందించే దిశగా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సాధన దివ్యాంగుల వ్యవస్థాపకురాలు పడమటి సురేఖారెడ్డి, కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తదితరులున్నారు.

కల్తీ టీ పొడి తయారీ ముఠా అరెస్టు

ఫిలింనగర్‌: కల్తీ టీపొడి తయారీ ముఠాను ఫిలింనగర్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 1,290 కిలోల కల్తీ టీ పొడితో పాటు రసాయన ఫ్లేవరింగ్‌ పదార్థాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఫిలింనగర్‌లోని దీన్‌దయాళ్‌నగర్‌లో కల్తీ టీ పొడి తయారీ జరుగుతుందన్న సమాచారంతో ఫిలింనగర్‌ ఎస్‌ఐ షేక్‌ సలీం ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement