మొయినాబాద్రూరల్: విద్యుత్ షాక్తో రెండు గేదెలు మృతి చెందిన సంఘటన మండలంలోని మేడిపల్లిలో చోటు చేసుకుంది. మేడిపల్లి గ్రామానికి చెందిన చాకలి బాబయ్య, బాబు తండ్రీకొడుకులు. వారి వద్ద ఉన్న గేదెలను గడ్డి మేపేందుకు ఆదివారం మధ్యాహ్నం గ్రామంలోని శివాలయం సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. గడ్డి మేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి రెండు గేదెలు మృత్యువాతపడ్డాయి. సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్తులు బాధితులను ఓదార్చారు. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.రెండున్నర లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


