ఆర్‌టీషీ | - | Sakshi
Sakshi News home page

ఆర్‌టీషీ

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

పథకం ప్రారంభం నుంచి 5.68కోట్ల మంది ట్రావెల్‌ ప్రయాణికుల్లో 70 శాతానికి పైగా నారీమణులే జిల్లాలో మూడు డిపోలు, 200 బస్సులు అయినా తగ్గని రద్దీ బస్సుల సంఖ్య పెంచాలని విన్నపం

వికారాబాద్‌: ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమయ్యాక ఆక్యుపెన్సీ రేటు భారీగా పెరిగింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక మహిళలు, ట్రాన్స్‌ జెండర్లకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. జిల్లాలో మూడు డిపోలు(వికారాబాద్‌, పరిగి, తాండూరు) ఉండగా వీటి పరిధిలో 200 బస్సులు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 5.68కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.209.33 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో బస్సులో రోజుకు సగటున 300 నుంచి 350 మంది ఉచితంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల్లో 70 శాతానికి పైగా నారీమణులే ఉంటున్నారు.

మహాలక్ష్మి పథకంతో..

గడచిన దశాబ్ద కాలంలో ఆర్టీసీ అనేక సంస్కరణలు చేపట్టినా ఆక్యుపెన్సీ పెరిగిన దాఖలాలు లేవు. మహాలక్ష్మి పథకం అమలయ్యాక ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. సీ్త్రలతోపాటు పురుషుల సంఖ్య కూడా పెరిగింది. ఇది ఆక్యుపెన్సీ రెండింతలు అవడానికి దోహదం చేసింది. గతంలో 50 నుంచి 60 లోపే నమోదయ్యే ఆక్యుపెన్సీ పథకం ప్రారంభమైన కొద్ది రోజులకే 95 నుంచి 120 శాతానికి చేరింది.

స్టాపుల్లో ఆగని బస్సులు

బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో సిబ్బందికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. బస్సుల్లో నిలుచుకోవడానికి కూడా స్థలం ఉండని పరిస్థితి నెలకొంది. గతంలో చెయ్యెత్తిన చోట బస్సు ఆపేవారు. ఆడిగిన చోట దించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సగం స్టాపుల్లో బస్సులు ఆపకుండానే వెళ్తున్నారు. ఇదిలా ఉండగా మహిళా ప్రయాణికులను కండక్టర్లు, డ్రైవర్లు చిన్న చూపు చూస్తున్నారు. వారికి పురుష ప్రయాణికులు గొంతుకలుపుతున్నారు. కుటుంబ సభ్యులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. మహిళలకు కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలనే స్లోగన్‌ ఇప్పుడు మచ్చుకై నా కనిపించడంలేదు. మహిళల సీట్లలో పురుషులే కూర్చుంటున్నారు. డబ్బులు ఇచ్చి టికెట్‌ కొంటున్నారంటూ కండక్టర్లు సైతం వారికే సపోర్టు చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం బస్సుల్లో వారు ఎదుర్కొంటున్న బాధలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సులన్నీ రద్దీగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచాలని పలువురు కోరుతున్నారు.

మహిళలకు ఉచిత ప్రయాణంతో పెరిగిన ఆక్యుపెన్సీ

Advertisement
 
Advertisement
Advertisement