మున్సిపల్ కమిషనర్‌కు
బీజేపీ కౌన్సిలర్ల వినతి
తాండూరు టౌన్: పట్టణ పరిధిలోని మల్‌రెడ్డిపల్లి సర్వే నంబర్ 52లోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు నాగారం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి తోపాటు రాఘవేంద్ర కాలనీ వాసులు కోరారు. మంగళవారం ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సర్వే నంబర్ 52లోని 13.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. అందులో మూడు ఎకరాలను మున్సిపల్ శాఖకు, ఐదు ఎకరాలను విద్యుత్ శాఖకు, రెండు ఎకరాలను రాఘవేంద్ర కాలనీకి కేటాయించినట్లు తెలిపారు. 3.12 ఎకరాల భూమి మిగిలి ఉందన్నారు. ఈనెల 7న జిల్లా మెథడిస్ట్ చర్చి, విలియంమూన్ స్కూల్ సభ్యులు, ఇతర వ్యక్తులు ఆక్రమించి ప్రహరీ నిర్మించడానికి యత్ని స్తున్నారని తెలిపారు. వెంటనే విచారణ చేపట్టాలని వారు కోరారు.
కొనసాగుతున్న ఆందోళన
దౌల్తాబాద్: మండలంలోని గోకఫసల్వాద్ గ్రామంలో ఆక్రమణకు గురవుతున్న శివాలయ భూమిని కాపాడాలంటూ చేపట్టిన ఆందోళన రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. సోమవారం గ్రామానికి చెందిన పలువరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేయగా మంగళవారం వచ్చి సర్వే చేస్తామని అధికారులు తెలిపారు. వారు రాకపోవడంతో తహసీల్దార్ వచ్చి తిరిగి ధర్నా నిర్వహించారు. ఆలయ భూమిని కాపాడాలని పలువురు డిమాండ్ చేశారు.
15న తలనీలాలసేకరణకు బహిరంగ వేలం
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్ట శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం నందు ఏడాదిపాటు తలనీలాల సేకరణకు ఈ నెల 15న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ నరేందర్, ధర్మకర్త పద్మనా భం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై ఒకటి నుంచి 2027 జూన్ 30 వరకు తలనీలాలు సేకరించుకోవచ్చని తెలిపారు. 15వ తేదీ ఉదయం 11గంటలకు ఆలయం ఆవరణలో వేటం ఉంటుందని, ఆసక్తి గల వారు రూ.50 వేలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని వారు తెలిపారు.
ప్రజాదర్బార్ పుస్తకావిష్కరణ
పూడూరు: బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎం ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో ఎంపీ ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా ప్రజాదర్బార్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ ప్రాంతం నుంచి బీసీ ఉద్యమాన్ని ప్రారంభించి జాతీయ స్థాయిలో ముద్ర వేసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఆర్ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిందితులను అరెస్ట్ చేయాలి
చేవెళ్ల: మొయినాబాద్ మండలంలోని కనకమామిడి ఫామ్‌హౌస్ కేసులో కొడిచెర్ల సాయికుమార్ మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు నరేందర్, జిల్లా కార్యదర్శి శివశంకర్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఏసీపీ కిషన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సంఘటన జరిగి 20 రోజులు అవుతున్నా ఈ కేసులో ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు కల్పించుకొని, నిందితులను అరెస్ట్ చేసి బాధితకుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఊరెంట ప్రవీణ్, నరేశ్, ప్రేమ్‌సాగర్, నగేశ్, రాజు తదితరులు ఉన్నారు.


