అప్రమత్తంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండండి

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి

తాండూరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కనుసన్నల్లోనే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కొనసాగుతోందని.. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ సర్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరులోని వినాయక కన్వెన్షన్‌లో నియోజకవర్గంలోని 269 మంది బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్‌ జాదవ్‌, ప్రత్యేక ట్రైనర్‌ వెంకటరమణ బీఎల్‌ఏలకు, పార్టీ నాయకులకు డిజిటల్‌ స్క్రీన్‌పై శిక్షణ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వచ్చేలా కృషి చేయాలన్నారు. అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలన్నారు. ఓటరు జాబితా సవరణలో నకిలీ, డబుల్‌, మరణించిన వారి పేర్లు తొలగించాల్సి ఉంటుందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, మాజీ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పట్లోల్ల నర్సింహులు, డీసీసీబీ మాజీ వైస్‌ చైర్మన్‌ రవిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం కనుసన్నల్లోనేసర్‌ ప్రక్రియ

Advertisement
 
Advertisement
Advertisement